- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పేద ప్రజల పార్టీ : శ్రీకాంత్ రెడ్డి
దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఘన చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి జరిగిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకొని అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
పార్టీకి సంస్థాగతంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తూ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పేద ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, నాయకులు జయ ప్రకాష్, నరేందర్ గౌడ్, నర్సింలు, సత్యనారాయణ, రాజు గౌడ్, భవానిఅశోక్, పట్నం శ్రీనివాస్, పుట్టి భాస్కర్, కృష్ణారెడ్డి, నారా గౌడ్, పల్నాటి భాస్కర్, ఎల్లయ్య, దిలీప్ కుమార్, స్వామి, విష్ణు మూర్తి, సత్యనారాయణ గౌడ్, బజరంగ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.