- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్‌ను అదుపు చేయడంలో సర్కార్ విఫలం
దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడటంలో లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సచివాలయం ప్రణాళిక గురించి చర్చించడానికి వారంలో రెండుసార్లు సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్ -19 పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
కరోనాతో మరణించిన వందలాది మంది శవాల వెనుక తన వైఫల్యాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 27న ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ముగ్గురు రోగులు చనిపోయారని, నిజామాబాద్ జిల్లా నుంచి మరణాలు నమోదయ్యాయన్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనాపై పోరాటం చేస్తున్నారని, కానీ సీఎం కేసీఆర్, మంత్రులు, కొంతమంది ఉన్నతాధికారులు తమ పనిచేయడం లేదన్నారు.