అప్పటి మేనిఫెస్టోకే అతీ గతీ లేదు

by Shyam |
Congress leader Shabbir Ali
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. 2018 అసెంబ్లీ మేనిఫెస్టోకే అతీ గతీ లేదన్నారు. ప్రజలను తండ్రీ కొడుకులిద్దరూ మాటలతో మోస గిస్తున్నారని తెలిపారు. కృష్ణా జలాలు హైద్రాబాద్ కు తీసుకువచ్చింది కాంగ్రెస్సే అని అన్నారు. నీరు తెచ్చింది తామని…నెత్తిన చల్లుకుంది వాళ్లని చెప్పారు. హైద్రాబాద్‌లో రూ.67 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో నగరాభివృద్దికి రూ. లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed