ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేయండి

by Shamantha N |
ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంగేర్ జిల్లాలో దుర్గామాత నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న వారికి, పోలీసులకు కాల్పుల ఘటనపై రణదీప్ నేతృత్వంలోని బృందం శుక్రవారం బీహార్ గవర్నర్‌ను కలిసింది. ఈ సందర్భంగా సీఎం నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఈ ఘటనకు కారణమైన సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలిపారు. కాగా కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన ఈసీ జిల్లా మెజిస్ట్రేట్‌తోపాటు ముంగేర్ జిల్లా ఎస్పీని తొలగించింది.

Advertisement

Next Story