- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతో కరోనా విజృంభిస్తోంది’
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందుతుందని, సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తోందని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. వైరస్ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు భరోసా కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోలేని పరిస్థితి దాపురించిందని, ఇలాంటి పరిస్థితులకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని దుయ్యబట్టారు. అన్ని జిల్లాల్లో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని, అలాగే ఇంటింటి వైద్య సర్వే చేసి మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని, దీంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనలో బతుకున్నారన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నాగం సూచించారు.