అవినీతి సొమ్ముతో మీడియా : మధుయాష్కి

by Shyam |
అవినీతి సొమ్ముతో మీడియా : మధుయాష్కి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అన్నింటా అవినీతి జరుగుతుందని, అవినీతి సొమ్ముతోనే సీఎం కేసీఆర్​ పేపర్, ఛానల్ పెట్టారని ఏఐసీసీ కార్యదర్శి మాధుయాష్కి విమర్శించారు. పక్కరాష్ట్రంలో సీఎం కూడా అదే విధంగా మీడియా పెట్టి ఇలాంటి కేసులోనే జైలుకు వెళ్లారనే విషయం గుర్తుచేశారు. గాంధీభవన్​లో శనివారం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ శ్రేణులు మొత్తం టీన్యూస్​, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేను బాయ్​కాట్ చేయాలని, పచ్చి అబద్ధాలు ప్రసారం చేస్తున్న సీఎం కేసీఆర్​ మీడియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి జవదేకర్​ ఛార్జ్​షీట్ విడుదల చేశారు కానీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని కరోనా వ్యాక్సిన్​ కోసం హైదరాబాద్​కు వస్తున్నారని, కానీ అంతర్యం ఏమిటోనని ప్రశ్నించారు.

లాక్​డౌన్​ సమయంలో పేదలను పట్టించుకోలేదని, పీఎం కేర్​ నుంచి తెలంగాణకు ఎంత సాయం చేశారో, సెకండ్ వేవ్​ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని మధుయాష్కి అన్నారు. రాష్ట్రంలో కరోనా అరికట్టడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యాడని, గ్రేటర్​ ఎన్నికల సందర్భంగా 15 వేల పోస్టర్లు వేయడానికి ఎక్కడి నుంచి సొమ్ము వచ్చిందన్నారు. వరదలు వస్తే సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​ దాటి రాలేదని, సీఎం కేసీఆర్​ను గ్రేటర్​ ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం ముస్లింలను రెచ్చగొట్టి బీజేపీకి చెంచా పార్టీగా మారిందని, బీజేపీ, ఎంఐఎం మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు ప్లాన్​ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్​ అన్ని వర్గాలను కాపాడుకుంటుందని, కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకే టీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని, కుట్ర చేస్తున్నాయనని మధుయాష్కి అరోపించారు.

Advertisement

Next Story