కాంగ్రెస్‌కు షాక్.. నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన కూన

by Anukaran |
Congress leader Koona Srisailam Gowd
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపట్లోనే శ్రీశైలం గౌడ్‌ కమలతీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నాయకులు కె లక్ష్మణ్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. కాగా, కాంగ్రెస్‌లో ఇప్పటికే విజయశాంతి, మరికొంతమంది నేతలు బయటకు వచ్చి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story