- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సూరమ్మ ప్రాజెక్టును వెంటనే నిర్మించండి’
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి మండలాలకు సాగు నీరందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులను కూడా పూర్తి చేసి 43 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. శాంతియుతంగా ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించేందుకు గత నెల 22న వెళితే అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి కరింనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం సాగునీటి విషయంలో వివక్ష చూపుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. మిడ్ మానేరు నీటిని నర్మాల ప్రాజెక్ట్‌కి తరలించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరేళ్లయినా పురోగతి లేకుండాపోయిందని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రెండేండ్ల క్రితం మంత్రి హరీష్ రావు సూరమ్మ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసినా, పనులు మాత్రం నేటికీ ప్రారంభం కాలేదన్నారు. అప్పుడు దసరా వరకు పనులు పూర్తి చేస్తామనీ చెప్పినా ఇప్పటికి రెండు దసరాలు వచ్చి వెళ్లాయే తప్ప సూరమ్మ ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదన్నారు. ఎత్తిపోతల ద్వారా సూరమ్మ చెరువును నింపాలని రూ. 1737 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లపై ఉన్న శ్రద్దలో పదోవంతు ఈ ప్రాజెక్టుపై పెడితే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.