- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం'
దిశ, కరీంనగర్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వానికి అడ్డుకట్ట వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరొనా పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దాచి పెడుతోందన్నారు. కరోనా విరాళాలు లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం షాపులు తెరవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని, వలస కార్మికులను తరలిస్తున్న తనపై కేసు పెట్టడం అన్యాయమన్నారు. అక్రమ కేసులు పెట్టడం మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అదిలాబాద్ జిల్లాలో సి.సి.సి.ఐ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆయన వెల్లడించారు.