ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు : చందా సంతోష్ కుమార్

by Shyam |
Congress leader Chanda Santosh Kumar
X

దిశ, మణుగూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చందా సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. పె ట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మణుగూరు మండలంలో సోమవారం సైకిల్, రిక్షా, ఆటోల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చందా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో నిత్యావసర సరుకులు ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకోవొద్దు అని సూచించారు.

సామాన్యులను ఆగ్రహానికి గురిచేసిన బీజేపీ త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కో-కన్వీనర్ గురజాల గోపి, పట్టణ అధ్యక్షుడు పిరానాకి నవీన్, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, అశ్వాపురం మండల అధ్యక్షుడు గాదే కేశవరెడ్డి, యూత్ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, భూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు పోలేపల్లి సుధాకర్ రెడ్డి, గోళ్ళ సాంబయ్య, కొమరం రామ్మూర్తి, ఎండి నూరుద్దీన్, పాల్వంచ రాములు, సౌజన్య, శబన, నాగమణి, రజిని పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed