ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా..? -భట్టి

by Shyam |
ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా..? -భట్టి
X

దిశ వెబ్‎డెస్క్: యావత్తు ప్రపంచం కోవిడ్ నివారణ తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం నాగర్‎కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సీఎల్పీ బృందం సందర్శించింది. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫామ్‎హౌస్‎కు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల దక్షిణ తెలంగాణ పూర్తిగా నష్టపోతుందని భట్టి విక్రమార్క అన్నారు.

Advertisement

Next Story