- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS కార్పొరేటర్ మర్డర్ కేసులో ‘నాయిని’కి క్లీన్ చిట్..
దిశ ప్రతినిధి, వరంగల్ : హనుమకొండలో సంచలనం సృష్టించిన నాటి టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి హైకోర్టులో క్లీన్‌చిట్ ఇచ్చింది. నాయినిపై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున చార్జిషీట్ నుంచి నాయిని పేరు తొలగించాలని పోలీస్‌శాఖను హైకోర్టు ఆదేశించడం గమనార్హం. 2017 జులై 13న టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హన్మకొండలో హత్యకు గురయ్యారు.
ఈ హత్యకేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయిని రాజేందర్ రెడ్డితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో రాజేందర్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. అయితే, రాజకీయ కక్షసాధింపు నేపథ్యంలోనే తనను ఈ కేసులో ఇరికించారని రాజేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసుల నుంచి సాంకేతిక ఆధారాలు ఏమి లేకపోవడంతో రాజేందర్ రెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. రాజకీయ కక్షలతో తనపై కేసు పెట్టారని.. కానీ, చివరికు న్యాయమే గెలిచిందని నాయిని వెల్లడించారు.