ఆదిలాబాదులో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనయ్..!

by Aamani |
ఆదిలాబాదులో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనయ్..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దేశంలో బీజేపీకి అసలు ప్రత్యర్థి ఎవరూ అంటే కాంగ్రెస్ అంటారు కదా. ఆ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యర్థి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. శుక్రవారం జరిగిన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి. గ్రామీణ ప్రాంత నిధులను పట్టణ ప్రాంతంలో ఎలా ఖర్చు చేస్తారని కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ సభ్యులు గణేష్ రెడ్డి ప్రశ్నించారు. తాను గిరిజన సామాజిక వర్గానికి చెందిన కారణంగానే తనను అవమానిస్తున్నారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ చెప్పారు. ఇది కాస్త జడ్పీలో దుమారం రేపింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ సభ్యుడు గణేష్ రెడ్డిని జెడ్పీ సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. జడ్పీ చైర్మన్ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ నేత, ఎంపీ సోయం బాబూరావు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ కలిసి సభ నుంచి వాకౌట్ చేశాయి. బద్ధ శత్రువులైన రెండు పార్టీలు ఇలా ఒక్కటయ్యాయని చర్చ మొదలైంది. ఎంతైనా రాజకీయాలు కదా..! ఆ తరువాత అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed