పీసీసీ రేసులో నేనంటే.. నేనంటూ ప్రకటనలు

by Shyam |   ( Updated:2020-12-05 22:24:00.0  )
పీసీసీ రేసులో నేనంటే.. నేనంటూ ప్రకటనలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఓటమి పూర్తి బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆశావహ నేతలు తెరమీదకు వచ్చారు. పీసీసీ పదవి నాకంటే.. నాకంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, ఒక్క అవకాశం ఇస్తే సత్తా చాటి చూపిస్తానని అంటున్నాడు. పీసీసీ చీఫ్‌ ఇస్తే కాంగ్రెస్‌ శక్తులను ఏకతాటిపైకి తెస్తానన్నారు. అంతేగాకుండా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేనూ పీసీసీ రేసులో ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం తాను సీరియస్‌గా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు, మధుయాష్కీ గౌడ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిలు సైతం పదవి కోసం చూస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్‌ను అధిష్ఠానం నిర్ణయిస్తుందని భట్టి తేల్చిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed