- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారుణం.. అక్కడ 120 మందిని చంపేసిన్రు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : అధికారుల చిన్న తప్పిదం ఆ గ్రామంలో 120 మందిని చంపేసింది. ఇదేంటి ఇంత మందిని ఒక్క తప్పు చంపేయడమేంటి అనుకుంటున్నారా? అదేంటో మీరే చదవండి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తెల్కపల్లి మండలం చిన్న ముద్దునూర్ గ్రామానికి చెందిన 120 మంది ఉపాధి హామీ కూలీలు నెల రోజుల క్రితం చనిపోయినట్టు అధికారులు నివేదిక తయారు చేశారు. సర్పంచ్ సైతం చనిపోయినట్టు అందులో ఉండటం గమనార్హం. రెండు నెలలుగా గ్రామంలో ఉపధిపనులకు వెళ్లిన చాలా మందికి కూలి డబ్బులు రాలేదు. దీంతో వీరంతా కూలీ పనులకు వెల్లడం లేదు. చేసిన పనులకు డబ్బులు ఎందుకు రావడంలేదనే విషయంపై ఆరా తీశారు.
తీరా అధికారులు వేసిన ప్రశ్న తిని ఖంగుతిన్నారు. మీరంతా బ్రతికే ఉన్నారా? అంటూ అధికారులు ప్రశ్నించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. తామంతా బతికే ఉన్నామని తెల్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం కనిపించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో అసలే ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తమకు.. వచ్చే డబ్బులు సైతం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తాము చనిపోయామంటూ నివేదిక తయారు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చనిపోయినట్టు నివేదిక ఇచ్చారు: దామోదర్ రెడ్డి, ముద్దునూర్ సర్పంచ్
విషయం తెలుసుకుని కూలీలతో కలిసి అధికారులను, ఎంపీడీఓను కలిసి వివరాలపై ఆరా తీశా.. వారికి అందిన జాబితా చూసి అధికారులే విస్తుపోయారు. అధికారుల ఇచ్చిన జాబితాలో నేను సైతం చనిపోయినట్టు ఉంది. ఇది తమకు తెలియకుండా జరిగిన పొరపాటని దానిని సరిచేస్తానని ఎంపీడీఓ హామీఇచ్చారు.
మేము చచ్చిపోయామని ఎలా ధృవీకరించారు?: హజారుద్దీన్, ఉపాధి కూలీ
మా ఇంట్లో నాతో పాటు నా భార్య, అమ్మ, వదిన చనిపోయినట్టు అధికారులు పంపించిన జాబితాలో ఉంది. మేము చనిపోయినట్టు వారు ఎలా ధృవీకరించారు.