BCCI Rule Book: ఆ నిబంధనను తీసి చెత్తబుట్టలో వేయాలి : రవిశాస్త్రి

by Shyam |
BCCI Rule Book: ఆ నిబంధనను తీసి చెత్తబుట్టలో వేయాలి : రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ రూల్ బుక్‌లో ఉన్న పరస్పర విరుద్ద ప్రయోజనాలు (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) నిబంధనను తీసి చెత్తబుట్టలో వేయాలని టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. లోధా కమిటీ నిర్ణయించిన ఈ నిబంధన వల్ల అర్హులైన అనేక మంది మాజీ క్రికెటర్లు మంచి అవకాశాలు కోల్పోతున్నారని రవిశాస్త్రి అన్నాడు. ఒక వ్యక్తి బోర్డులో సభ్యుడై ఉన్నంత మాత్రాన ఐపీఎల్ లేదా బ్రాడ్‌కాస్టర్ దగ్గర పని చేయకూడదు అనేది ఒక చెత్త నిబంధన అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. కాగా, రవిశాస్త్రి వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ మదన్ లాల్ సమర్ధించాడు. లోధా కమిటీ చేసిన రెండు నిబంధనలు నిజంగా దేనికీ పనికిరానివని అన్నాడు. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో పాటు వయసుకు సంబంధించిన నిబంధనను కూడా సడలించాలని మదన్ లాల్ అన్నాడు. లోధా కమిటీ నిర్ణయం ప్రకారం 65 ఏళ్ల లోపు బోర్డు నుంచి తప్పుకోవల్సి ఉంటుంది. అయితే దీన్ని 70 ఏళ్లకు పెంచాలని మదన్ లాల్ అంటున్నాడు. ఎంతో మంది మంచి అడ్మినిస్ట్రేటర్లు మనకు ఉన్నారు. వారి సేవలను ఐదేళ్ల ముందుగానే ముగించడం వల్ల చాలా నష్టపోతున్నామని మదన్ లాల్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed