ఒక యువతి.. ముగ్గురు ప్రేమికులు.. గ్రౌండ్ లో రచ్చరచ్చ

by Anukaran |   ( Updated:2021-04-09 07:00:00.0  )
ఒక యువతి.. ముగ్గురు ప్రేమికులు.. గ్రౌండ్ లో రచ్చరచ్చ
X

దిశ, వెబ్ డెస్క్: చిన్నప్పటి నుండి వారు ముగ్గురు మంచి స్నేహితులు.. ఏది దాచుకోకుండా ఒకరి దగ్గర ఒకరు అన్ని షేర్ చేసుకుంటారు. వారి స్నేహం చూసి అందరు శభాష్ అని మెచ్చుకునేవారు.. ఇంతలో ఒకరి ప్రేమ వ్యవహారం వారి మధ్య చిచ్చు రేపింది. ముగ్గురు స్నేహితులను కొట్టుకొనేలా చేసి.. చివరికి ఒకరిని ఆసుపత్రి పాలు.. మరొకర్ని జైలుపాలు చేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.

జూబ్లీహిల్స్‌ లో నివసించే మైనర్ బాలుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనికి మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు స్నేహితులు ఎప్పుడు కలిసే ఉండేవారు. అయితే ఆ బాలుడు చిన్నప్పటి నుండి తన అక్క కూతురుని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకొని తన ప్రేమకు హెల్ప్ చేయాలనీ కోరాడు. దాంతో సరే అన్న స్నేహితులు అతడి ప్రేమకు హెల్ప్ చేస్తున్నట్లే చేస్తూ ఆమెకు వీరు కూడా లైన్ వేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవలే మేనకోడలు, అతని ప్రేమను నిరాకరించింది. దీంతో ఆ ఇద్దరు బాలురు తమ ప్రేమను బాలికకు వ్యక్తపరిచారు. వీరి ప్రేమను కూడా బాలిక నిరాకరించింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న బాలుడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి తిట్టాడు. “నీ మేనకోడల్ని మేము ప్రేమిస్తున్నాం.. నువ్వు వదిలేయ్” అంటూ వారు వాట్స్ అప్ మెసేజ్ పెట్టడంతో ఆగ్రహానికి గురైన బాలుడు వారి స్కూల్‌ సమీపంలోని గ్రౌండ్‌కు వస్తే తేల్చుకుందామని హెచ్చరించాడు. అక్కడ స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో బాలుడు తనతో తెచ్చుకున్న బ్లేడుతో ఒక స్నేహితుడి మెడపై గాట్లు పెట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుకుంటున్న బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా… సదరు మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story