గోషామహల్‌ టీఆర్ఎస్ సమావేశంలో గొడవ

by Shyam |
గోషామహల్‌ టీఆర్ఎస్ సమావేశంలో గొడవ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్‌ పార్టీలో ముందు నుంచి కొనసాగుతూ గతంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆర్వీ మహేందర్‌ను పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం స్టేజీ పైకి పిలవక పోవడంతో ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ వర్గీయులు మహేందర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి చిన్న తోపులాట జరిగింది. ఇదేక్రమంలో సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ ఇరువర్గాల వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Next Story