- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చంపేట మున్సిపల్ సమావేశం రసాభాస
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ సమావేశం బుధవారం చైర్మన్ నరసింహ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో పట్టణ అభివృద్ధి, తదితర ఎజెండా అంశాలపై చర్చ కొనసాగింది. ఎజెండా అంశాలలో ప్రస్తుతం గిరిజనులు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే తీజ్ వేడుకల సందర్భంగా గిరిజన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలని కౌన్సిలర్ సుగుణమ్మ సమావేశం దృష్టికి తీసుకు వచ్చింది. దానిని ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుండి వేడుకలకు నిధులు కేటాయించాలని, పట్టణ అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించేందుకు ఎలా తీర్మానం చేస్తారని, దీన్ని ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గౌరీ శంకర్, సుదర్శన్ లు ముందుగా సభ నుండి బహిష్కరించి బయటికి వెళ్లారు. తదుపరి నలుగురు కౌన్సిలర్ సభను బహిష్కరించారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొద్దిసేపు రసాభాసగా సమావేశం కొనసాగింది.
ఏకపక్షంగా తీర్మానాలు…
సమావేశాన్ని బహిష్కరించి అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గౌరీ శంకర్, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి బలం ఉందని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏకపక్షంగా తీర్మానాలు నిర్ణయాలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వారి తీర్మానం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సమావేశాన్ని బహిష్కరించమని తెలిపారు. మున్సిపల్ నిధులను ఇతర వాటికి మల్లించేందుకు వారికి అధికారం ఎక్కడుందని సభలో నిలదీస్తామని తెలిపారు.
గిరిజనులను అవమాన పరిచేలా ప్రతిపక్ష పార్టీ…
తదుపరి అధికార పార్టీ కౌన్సిలర్ సుగుణమ్మ, సోమ్లా నాయక్, అంతటి శివ, వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ సుగుణమ్మ తీజ్ వేడుకలకు నిధులు కేటాయించాలని ఇటీవల మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందించామని తెలిపారు. నిధులు లేవని తేలిపోవడంతో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని అందుకు కలెక్టర్ స్పందిస్తూ మున్సిపల్ పరిధిలో నిధులు ఉంటే వీలును బట్టి నిధులు కేటాయించాలని సూచించిన పత్రాన్ని మీడియాకు చూపించారు. దాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గిరిజనుల అవమాన పరిచేలా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు తీసుకోవాలని మాట్లాడడం అవివేకమని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. అలాగే పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఎజెండా పత్రాన్ని సహచర కౌన్సిలర్లు చింపి వేయడం పట్టణ ప్రజలను అవమానపరచడమే అని వారు ఎద్దేవా చేశారు. పై విధంగా అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ ఒకరిపై ఒకరు మీడియా సమావేశాలు పెడుతూ విమర్శలు చేసుకున్నారు.