- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మహిళ.. ఎక్కడెక్కడ తిరిగిందంటే!
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు ప్రకంపనలు సృష్టిస్తోన్నది. కరోనా పాజిటివ్‌తో జిల్లాలోని చెన్నూరు మండలం ముత్తురావుపేటకు చెందిన మహిళ అసలు ఇంటి నుండే బయటకు రాలేదని ప్రచారం జరిగింది. కానీ, ఆ మహిళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తుండటంతో ఆందోళన మొదలైంది. కరోనాతో మృతి చెందిన మహిళ మంచిర్యాల సమీపంలో ఉన్న శ్రీరాంపూర్ లో జరిగిన ఓ వివాహానికి హాజరైనట్లు ఆమె బంధువులు తెలిపారు. అలాగే ఆమె స్వగ్రామంలో జరిగిన మరొక శుభకార్యంలో పాల్గొన్నట్లు కూడా తెలిపారు. ఈ పరిణామాలు మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.
క్వారంటైన్ కు 103 మంది..
మృతి చెందిన మహిళను కలిసినవారి కోసం వెతుకులాట మొదలయ్యింది. ఇప్పటికే బంధువులు ఇచ్చిన సమాచారంతో జాబితా తయారైంది. సమీప బంధువులలో 33 మందిని ఇప్పటికే క్వారంటైన్ కు పంపిన అధికారులు… మరో 70 మందిని కూడా క్వారంటైన్ కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో కర్ఫ్యూ…
తొలి కేసు నమోదు కావడంతో మంచిర్యాల జిల్లాలో కర్ఫ్యూ అమలుకు జిల్లా కలెక్టర్ భారతి హొళికెరీ ఆదేశాలు ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించిన యంత్రాంగం రాకపోకలను నియంత్రించింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
tags: Adilabad, Corona, Woman’s Death, Marriage, Relatives, Quarantine