షర్మిల సభకు పర్మిషన్ గ్రాంటెడ్, కానీ..

by Sridhar Babu |
షర్మిల సభకు పర్మిషన్ గ్రాంటెడ్, కానీ..
X

దిశ, ప్రతినిధి, ఖమ్మం: ఎన్నో అడ్డంకులు.. ఎంతో ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు షర్మిల సభలకు అనుమతి లభించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కేవలం 5వేల మందితో సభ నిర్వహించుకోవచ్చని పోలీస్ శాఖ పర్మిషన్ ఇచ్చింది. 9వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహించతలపెట్టిన సభపై మొదటి నుంచీ నీలినీడలే కమ్ముకున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాక ఇప్పుడు సభ రద్దు చేసుకోవడం సాధ్యం కాదని ఖమ్మం సీపీ ఎదుట కొండా రాఘవ రెడ్డి స్పష్టం చేయడంతో షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. దీంతో సభ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. వైఎస్, షర్మిల అభిమానులు ఈ సభను సక్సెస్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Advertisement

Next Story