- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణకు దక్కాల్సిందే.. ఇంకా ఎన్నిసార్లు ఇలా చేస్తారు
దిశ, తెలంగాణ బ్యూరో: రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందని అన్నారు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మరోసారి తెలంగాణపై తన వ్యతిరేక వైఖరిని చాటుకుందన్నారు.
సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌కు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సమాధానంపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఐఆర్ ప్రాజెక్టుని రద్దు చేసిన కేంద్రం.. కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని స్పష్టం చేయడం దారుణమన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు పలుమార్లు లేఖలు రాశారన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన విలువైన 150 ఎకరాల భూమిని సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 8 రైల్వే లైన్లు, సర్వే దశలో ఉన్న 3 లైన్లు, 4 నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలు, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్, రైల్వే వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరినా.. కేంద్రం నుంచి కనీస స్పందన లేదని ఆరోపించారు. రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ బీజేపీ ద్రోహం చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు.