- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించండి
దిశ, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో మరోమారు లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేసులు తక్కువగా ఉన్న రోజుల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించి నేడు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా లాక్ డౌన్ సడలించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆంక్షలను ప్రభుత్వం క్రమక్రమంగా ఎత్తి వేయడంతో నగరంలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. ప్రజలు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిశ’తో నగర వాసులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
శానిటైజర్లు అందుబాటులో లేవు
లాక్‌డౌన్ సడలించడంతో నగరంలో అన్ని ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. ముఖ్యంగా మెడికల్ షాపుల వద్ద పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దుకాణంలో పని చేసే వారికి మాస్కులు కూడా ధరించడం లేదు. హోటళ్లలో పార్శిళ్లు ఇస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. -ఎన్.ఆర్ లక్ష్మణ్ రావు
అవసరం లేకున్నా బయటకు
కరోనా తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. అవసరం లేకున్నా బయటకు వచ్చి కరోనా బారిన పడడమే కాకుండా ఇతరులు కూడా వైరస్ బారిన పడేందుకు కారణమౌతున్నారు. రోడ్లపై పోలీసుల తనిఖీలు కూడా తగ్గిపోవడంతో వాహనాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఇలాగే మరికొన్ని రోజులుంటే ప్రపంచంలో కరోనా కేసులలో మనదేశం మొదటి స్థానంలోకి చేరే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం వెంటనే సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగించాలి. -జై శంకర్, గోషామహల్
కొనసాగించాలి
లాక్‌డౌన్ సడలించినప్పటి నుంచి నగరంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ప్రతి రోజు రెండు వందలకు పైగా కేసులు నమోదు అవుతుండడంతో బయటకు రావాలంటే భయంగా ఉంది. లాక్ డౌన్‌ను కొనసాగించాలి. మొదట్లో విధించిన ఆంక్షలను పునరుద్ధరించి కరోనాను అదుపు చేయాలి. -లక్ష్మి నరసింహ, కొత్తపేట
వైద్య సిబ్బందికి కరోనా
ప్రస్తుతం ఎవరికి కరోనా ఉందో లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం లాక్‌డౌన్ సడలించడంతో పనుల కోసం బయటకు రావాల్సి వస్తోంది. మామూలు జ్వరం వచ్చినా కరోనా అని అనుమాన పడుతున్నాం. హాస్పిటల్స్‌లో కూడా పరిస్థితులు బాగా లేవు. వైద్యులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. కరోనా అదుపులోకి వచ్చే వరకు లాక్ డౌన్‌ను తిరిగి అమలు చేయాలి. -భగత్. హస్తినాపురం