- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ ఇళ్లను త్వరగా పూర్తి చేయండి
దిశ, మహబూబ్ నగర్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. ఇసుక, సిమెంట్, ఇతర సామగ్రి కొరత లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రహదారి పక్కన పూలు, పండ్ల చెట్లను పెంచాలని సంబంధిత అధికారికి కలెక్టర్ సూచించారు. నిర్మాణంల్లో ఎలాంటి జాప్యం వహించరాదని సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని కలెక్టర్ సంబంధిత అధికారులకు వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు, మహబూబ్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, హోసింగ్ కార్పొరేషన్ పీడీ రమణ, తదితరులు పాల్గొన్నారు
tags ; carona,lockdown, dobule bedroom houses, complete early, collecter s.venkatrao