బిగ్ బ్రేకింగ్.. ఎంపీ కోమటిరెడ్డికి భారీ షాక్..

by Anukaran |
komatireddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేష్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. టీపీసీసీ ప్రకటన తర్వాత నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్​ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ అంశం పార్టీలో హాట్​ టాపిక్​గా మారింది. కాగా, ఇటీవల వైఎస్​ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్​ నుంచి ఎవరూ వెళ్లవద్దంటూ టీపీసీసీ ప్రకటించింది. కానీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీనియర్​ నేత ఎంఏ ఖాన్​ హాజరయ్యారు.

వీరిపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఏఐసీసీ నిర్ణయించాలంటూ వివరించారు. ప్రస్తుతం ఈ విషయం కాంగ్రెస్​ శ్రేణుల్లో హాట్​ టాపిక్​గా మారింది.

Advertisement

Next Story

Most Viewed