స్టార్ డైరెక్టర్ స్టోరీపై నమోదైన కంప్లయింట్

by Shyam |   ( Updated:2021-07-29 04:40:43.0  )
స్టార్ డైరెక్టర్ స్టోరీపై నమోదైన కంప్లయింట్
X

దిశ, సినిమా : అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ‘గోస్ట్ స్టోరీస్’పై కంప్లయింట్ నమోదైంది. సదరు ఫిర్యాదులో గతేడాది నాలుగు కథల సంకలనంగా రూపొందిన ఈ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ కంటెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(గైడ్‌లైన్స్ ఫర్ ఇంటర్మీడియేటరీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్) కింద అందిన మొదటి ఫిర్యాదు ఇదే కావడం విశేషం. ఈ కొత్త రూల్ ప్రకారం.. వ్యూయర్స్ సమస్యల పరిష్కారానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఒక పరిష్కార యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు అందిన ఫిర్యాదు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ గ్రీవెన్స్ రీడ్రెస్సెల్ ఆఫీసర్ వద్ద పెండింగ్‌లో ఉంది.

స్టోరీపై వ్యక్తమైన అభ్యంతరం విషయానికొస్తే, ఆంథాలజీలోని ఒక స్టోరీలో శోభిత ధూళిపాల క్యారెక్టర్.. తనకు గర్భస్రావం అయిన తర్వాత పిండాన్ని తింటుంది. అయితే కథకు ఈ సన్నివేశం అవసరం లేదని, ఒకవేళ మేకర్స్ అలాంటి సీన్ యాడ్ చేయాలనుకుంటే, గర్భస్రావం వల్ల బాధపడుతున్న మహిళలకు అది ఒక హెచ్చరికలా ఉండాలని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ నాలుగు స్టోరీలను జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్ డైరెక్ట్ చేశారు.

Read more: ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న జిమ్నాస్ట్.. ప్రశంసించిన ప్రియాంక

Advertisement

Next Story