- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీక కలర్ ఫొటో దీపం
దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫొటో’ సినిమాకు దాదాపు అందరూ మంచి మార్కులే వేశారు. అయితే ఇప్పటికే మంచి మార్కులు పొందిన, పొందుతున్న రోజూ చూసే కలర్ ఫొటోతో ఈ సినిమాను సరిపోల్చడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. అర్థం కాలేదా? రోజూ చూసే కలర్ ఫొటో అంటే ‘కార్తీక దీపం’ సీరియల్. ఈ సీరియల్ కూడా దాదాపుగా ‘కలర్ ఫొటో’ ఇతివృత్తంతోనే ప్రారంభమైంది. కాకపోతే ఇక్కడ అమ్మాయి కారునలుపు. కలర్ ఫొటో సినిమాలో అబ్బాయి నలుపు. నిజం చెప్పాలంటే నల్లగా ఉన్న అబ్బాయిలకు ఎక్కడో ఓ మూలన కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అందుకే డబ్బు లేకున్నా పర్లేదు గానీ తెల్లగా ఉన్న అమ్మాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటారు. ఇక్కడ కల అని ఎందుకు అన్నామంటే.. డబ్బు, ఉద్యోగం, బ్యాక్‌గ్రౌండ్ లేని చాలామంది నల్లబ్బాయిలకు అది నిజంగా కలే.
కలర్ ఫొటోలో ప్రేమ సక్సెస్ కాలేదు, కానీ ‘కార్తీక దీపం’లో పెళ్లి కూడా అయింది. కానీ ఈ రెండింటిలోనూ సమస్య ఆ ప్రేమించుకున్న జంటలది కాదు, పక్కనున్న వాళ్లది. ఇదిలా ఉండగా అమ్మాయి నల్లగా ఉన్నా, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే లైఫ్‌లో మంచి అబ్బాయి దొరుకుతాడు అనడానికి కార్తీక దీపం సీరియల్‌నే ఉదాహరణగా చూపిస్తున్నారు. అంతేకాకుండా కలర్ ఫొటో సినిమాలో హీరో తాను నల్లగా ఉన్నందుకు బాధపడుతుంటాడు. కానీ కార్తీక దీపంలో దీప ఏనాడూ తాను నల్లగా ఉన్నానని క్రీములు పెట్టలేదు, అద్దం ముందు బాధపడలేదు. ఇలా రకరకాలుగా కలర్ ఫోటో సినిమాకు, కార్తీక దీపం సీరియల్‌కు లింక్ చేస్తూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టే ఈ ట్రెండ్‌ను ‘కార్తీక కలర్ ఫొటో దీపం’ అనాల్సి వచ్చింది.