వారానికి రెండు రోజులు లాక్ డౌన్: సీఎం

by Shamantha N |
వారానికి రెండు రోజులు లాక్ డౌన్: సీఎం
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోనూ కొన్ని చోట్ల కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరుగుతున్నట్టు గుర్తించామని రాష్ట్ర హోం కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఈ వ్యాప్తి శృంఖలాలను తెంచడానికి వారంలో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. సీఎం మమతా బెనర్జీతో ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతివారం రెండు రోజులు పూర్తి లాక్‌డౌన్ ఉంటుందని, ఈ వారంలో గురువారం, శనివారం లాక్‌డౌన్ ఉంటుందని, తర్వాతి వారంలో బుధవారం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తామని బందోపాధ్యాయ్ ప్రకటించారు. అన్ని కార్యాలయాలు, రవాణా సేవలు ఈ రోజుల్లో బంద్ అవుతాయి. బ్యాంకులూ శని, ఆదివారాల్లో మూసివేసి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

Advertisement

Next Story