కన్నుల పండుగగా ‘చెంచుల’ సామూహిక వివాహాలు. ఒకేసారి 140 జంటలకు..!

by Shyam |
కన్నుల పండుగగా ‘చెంచుల’ సామూహిక వివాహాలు. ఒకేసారి 140 జంటలకు..!
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గట్టు అశోక్ రెడ్డి కార్య నిర్వహణలో శనివారం ఆదివాసీ చెంచులు అయిన 140 నవ దంపతులకు సామూహిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవంలో ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మ శ్రీ గరికపాటి నరసింహ రావు గారి ప్రవచనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివాహ విశిష్టత, హైందవ ధర్మం, ఆదివాసీల గొప్పతనం గురించి చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీ పోతుగంటి రాములు, వనవాసీ కళ్యాణ పరిషత్ నాయకులు గట్టు అశోక్ రెడ్డి, ఉడుతనూరి లింగయ్య, వనవాసీ కళ్యాణ పరిషత్ నాయకులు కాట్రాజు వెంకటయ్య, ఉడుతనూరి లింగయ్య, అఖిల భారత వనవాసీ కార్యదర్శిలు సోమయాజులు, రామ చంద్రయ్య, క్షేత్ర ఘటనా మంత్రి త్రిపాఠీ జీ, ప్రాంత ఘటనా మంత్రి సుధీర్ జీ, నరసింహా రెడ్డి, విభాగ సంఘ్ చాలక్ ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విభాగ కార్యవాహ్ రాంరెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవహ్ కర్రెమ్ నారాయణ, అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమల, నాగర్ కర్నూల్ మార్కెట్ ఛైర్మెన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్, మంత్ర్యా నాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ్మ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు మండికారి బాలాజీ, మంగ్య నాయక్, రేణయ్య, కౌన్సిలర్లు సుగుణమ్మ, గౌరీ శంకర్, వనవాసీ నాయకులు నరసింహా, రఘపతి, దుర్గా భవాని మహిళా సంఘం సభ్యులు మరియు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి సంఘ్ పరివార్, చెంచు సంఘం నాయకులు, వివిధ చెంచు పెంటల నుంచి చెంచులు తరలివచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన పెద్దలు నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

Advertisement

Next Story