- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేపాల్ పీఎం బహిష్కరణ
by vinod kumar |
X
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని కేపీ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్‌సీపీ) నుంచి బహిష్కరించారు. ఎన్‌సీపీ కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఓలి సభ్యత్వాన్ని తొలగించినట్టు పార్టీ నేత నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు. నేపాల్ పార్లమెంటు రద్దుపై పీఎం కేపీ ఓలి ఏకపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాలు వేగంగా మలుపుతిరిగాయి.
పార్లమెంటు రద్దుకు గల కారణాలను తెలియజేయాల్సిందిగా తాము పలుసార్లు ఆదేశించినప్పటికీ సమాధానమివ్వలేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, ఆయనకు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని పార్టీ నేతలు తెలిపారు. పీఎం కేపీ ఓలి పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు ఎన్నికలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story