కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా

by Shyam |
కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా
X

దిశ, స్పోర్ట్స్ :

వచ్చే ఏడాది జరగాల్సిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌ను 2023కు వాయిదా వేస్తూ నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా 2021కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కాగా, 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ నిర్వహించనున్నారు. దీంతో 2021 ఆగస్టు 1 నుంచి 8 వరకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరగాల్సిన కామన్వెల్త్ యూత్ గేమ్స్ రెండేళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రకటించింది. కొత్త తేదీలను షెడ్యూల్ చేసిన తర్వాత ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

Tags: Common Wealth Youth Games, Trinidad and Tobago, Olympics 2020, Tokyo

Advertisement

Next Story