క్రీడ‌ల్లో రాణించాలంటే నిత్యసాధ‌న అవసరం

by Sridhar Babu |
క్రీడ‌ల్లో రాణించాలంటే నిత్యసాధ‌న అవసరం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం :
క్రీడల్లో రాణించాలంటే ప్రతి రోజూ సాధన చేయాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల 9 నెలల పోలీస్ శిక్షణలో భాగంగా హైదరాబాద్ సిటీ (79) ,నిజామాబాదు (138) చెందిన మొత్తం 217 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఖమ్మం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రలో ఏడు నేలలుగా శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో సిబ్బందిలో ఉత్సాహం, క్రీడా స్పూర్తిని పెంపొందించడానికి రెండు రోజుల పాటు ఖమ్మం సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించారు.

ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ .. కొవిడ్ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మానసికంగా ఉల్లాసం నింపేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు.మనం ఎంచుకున్న క్రీడలపై మక్కువ పెంచుకుని నిరంతర సాధన చేయడంతోనే అత్యున్నత ప్రదర్శన చేయగలుగుతామన్నారు.

క్రీడా పోటీల ద్వారా వ్యక్తిగతంగా రాణించడంతోపాటు జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించేలా క్రీడాకారులు తమ శక్తిని ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు , సిటీసీ ఏసీపీ ప్రసాద్ రావు, ఏఆర్ ఏసీపీ విజయబాబు, సీఐ సాంబరాజు, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు, శ్రీనివాస్, రవి, తిరుపతిరావు, సాంబశివరావు , ఎస్సైలు శ్రీనివాస్ , ఆర్ఎస్‌ఐలు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed