యూరోపియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రారంభం

by Shyam |   ( Updated:2020-11-06 09:25:32.0  )
యూరోపియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ అభిమానులకు శుభవార్త. యూరోపియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా యూరోపియన్​ సినిమాలు వీక్షించే అవకాశం లభించింది. ఈ నెల 20వ తేదీ వరకు ఫెస్టివల్​‌లో భాగంగా 42 సినిమాలు చూడటానికి అవకాశం కల్పించారు. కాగా ఈ సినిమాలు 36 భాషల్లో ఉంటాయి. అంతేగాకుండా ఇందులో 27 సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. 15 మంది మహిళా దర్శకులు కూడా పాల్గొననున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్​, ఫ్రాన్స్​, ఆఫ్ఘనిస్తాన్​, బెల్జియం, బల్గేరియా, డెన్మార్క్​.. 27 దేశాల సినిమాలు ప్రదర్శిస్తారు. ఆసక్తి కలిగిన వారు euffindia.com లో వర్చువల్​ గానే యూరోపియన్​ యూనియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ సినిమాలను వీక్షించొచ్చునని నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్యుమెంటరీ, కామెడీ సినిమాలతో పాటు పలు షార్ట్​ ఫిల్మ్​లు కూడా ఫెస్టివల్​ లో ఉంటాయన్నారు.

Advertisement

Next Story