‘పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని.. గొప్పగా వర్ణించిన అలీ’

by Shyam |   ( Updated:2020-07-16 12:07:32.0  )
‘పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని.. గొప్పగా వర్ణించిన అలీ’
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. అలీ లేకుంటే తన సినిమాల్లో ఏదో వెలితిగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పలు వేదికల మీద కూడా చెప్పారు. ముఖ్యంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషీ’ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటి వీరిద్దరూ ఇటీవల రాజకీయాల కారణంగా దూరమయ్యారు. పవన్ కళ్యాణ్‌కు ఎంతో ఇష్టమైన, దగ్గరగా ఉండే వ్యక్తి జనసేనలో కాకుండా వైసీపీలో చేరడం, పవన్ కళ్యాణ్‌తో సహా అందరినీ కలవరపెట్టింది. అంతేగాకుండా రాజకీయాల్లో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు సైతం చేస్తున్నారు. కాగా గత రెండ్రోజుల క్రితం అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ, గత రికార్డులను తుడిచిపెట్టింది. తాజాగా కాగా దీనిపై అలీ తన ట్విట్టర్‌లో స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘‘వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు, నీ కులం.. గుణం.. వర్ణం.. గురించి మాట్లాడుతారు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి.. నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు.’ అంటూ అలీ ట్వీట్ చేశారు. దీనిపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మిత్రద్రోహి రాజకీయాల కోసం రంగులు మారే నీ వ్యక్తిత్వాన్ని మరవలేదని అలీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసారు.

https://twitter.com/ActorAliOffl/status/1282660842639462402

Advertisement

Next Story