బాసగూడ చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్..

by Anukaran |   ( Updated:2021-04-08 07:43:43.0  )
బాసగూడ చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈనెల 3వ తేదీన సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు బందీగా పట్టుకున్నారు. ప్రభుత్వంతో తాము చర్యలకు సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌కు ఎలాంటి హాని తలపెట్టమని ముందుగానే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఆతన్ని విడుదల చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. పద్మశ్రీ ధర్మపాల్ సైని, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్య, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల మధ్యప్రదేశ్ జట్టు సభ్యుడు సహా వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో నక్సలైట్లు జవాన్ ను విడుదల చేశారని తెలిసింది. విడుదల తర్వాత మధ్యవర్తిత్వం కోసం వెళ్ళిన బృందం, జవాన్‌తో పాటు బాసగుడకు చేరుకుంది. విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు సభ్యుల బృందంలో బస్తర్‌కు చెందిన 7 ఏడుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు.

Advertisement

Next Story