SCR Recruitment: రాత పరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో 4232 ఉద్యోగాల భర్తీ.. పూర్తి డీటెయిల్స్ ఇవే..!

by Maddikunta Saikiran |
SCR Recruitment: రాత పరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో 4232 ఉద్యోగాల భర్తీ.. పూర్తి డీటెయిల్స్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్(Secbad)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే(SCR) పరిధిలోని ఖాళీగా ఉన్న 4232 అప్రెంటిస్(Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్ లాంటి తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://scr.indianrailways.gov.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

అప్రెంటిస్ - 4232

విద్యార్హత:

కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్, ఐటీఐ ఉతీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

టెన్త్ క్లాస్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయోపరిమితి:

28 డిసెంబర్ 2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Next Story