Sonu Sood: నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు.. సోనూసూద్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Hamsa |
Sonu Sood: నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు.. సోనూసూద్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సోనూసూద్(Sonu Sood) సినిమాలు చేసిన దానికంటే కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాకుండా ఉపాధి లేని వారికి ఉద్యోగం కల్పించడంతో పాటు అనారోగ్య సమస్యలతో సాయం కావాలని కోరిన వారికి డబ్బు సాయం చేశారు. ఓ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సోనూసూద్ ‘ఫతే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూసూద్ షాకింగ్ కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురవుతున్నారు. సోనూసూద్ మాట్లాడుతూ.. ‘‘నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. కానీ నేను దానిని తిరస్కరించడంతో.. వారు నన్ను డిప్యూటీ సీఎం చేయాలని కోరుకున్నారు. అంతేకాకుండా నాకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారు. అది కూడా రిజెస్ట్ చేయడంతో ఈ దేశంలోని పెద్ద వ్యక్తులు నన్ను కలవాలనుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ చెల్లి ఎంపీగా చేసి ఓడిపోయింది.. నీకు సీఎంగా ఆఫర్ రావడం ఏంటని? రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story