Ayodhya: న్యూ ఇయర్ వేళ ఆయోధ్యకు భారీగా సందర్శకులు.. హోటల్స్ అన్నీ ఫుల్!

by vinod kumar |
Ayodhya: న్యూ ఇయర్ వేళ ఆయోధ్యకు భారీగా సందర్శకులు.. హోటల్స్ అన్నీ ఫుల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త సంవత్సరం వేళ అయోధ్య(Ayodya)కు భారీగా సందర్శకులు తరలి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అయోధ్య నగరంలోని హోటళ్లన్నీ ఇప్పటికే బుక్ అయ్యాయి. న్యూ ఇయర్ (New year), రామమందిరంలో రామ్ లల్లా(Ram lalla) విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భక్తులు అధికంగా తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల కంటే ప్రస్తుత రద్దీ ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకుల తాకిడి దృష్యా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ దర్శన సమయాన్ని పొడిగించింది. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు టైం పెంచింది. అలాగే రద్దీని దృష్టిలో పెట్టుకుని విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్భంగా అయోధ్యలోని స్థానిక హోటల్ యజమాని అంకిత్ మిశ్రా (Ankith Mishra) మాట్లాడుతూ.. ‘వచ్చే నూతన ఏడాదిలో అయోధ్యకు వచ్చే భక్తులకు స్వాగతం పలకడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మా హోటల్ రూమ్స్ అన్నీ జవనరి 15వరకు బుక్ చేయబడ్డాయి. రద్దీ దృష్యా కొన్ని హోటళ్లు రాత్రి రూ.10,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి’ అని తెలిపారు. కాగా, ఈ ఏడాది జవవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story