హుజూర్ నగర్ సభ చరిత్రలో నిలిచిపోతుంది

by Naveena |
హుజూర్ నగర్ సభ చరిత్రలో నిలిచిపోతుంది
X

దిశ ,హుజూర్ నగర్: హుజుర్ నగర్ లో ఈనెల 30 ఉగాది పండగ రోజున నిర్వహించేందుకు తలపెట్టిన సభ దేశ చరిత్రలోనే చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికి సన్న బియ్యం పంపిణీ అన్నది దేశ చరిత్రలోనే ఒక మైలు రాయి లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ నెల 30 న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న విషయం ఇప్పటికే తెలిసిందే.

ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రాంగణం వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. జరుగుతున్న పనులను మల్టీజోన్ టు ఐజి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ జిల్లా ఎస్పీ నర్సింహతో కలిసి సభ ప్రాంగణ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికను పరిశీలించారు. అధికారులంతా పనులను త్వరగాతిన పూర్తి చేయాలని అన్నారు. అలాగే రామస్వామి గుట్ట వద్ద నిర్మాణం పూర్తి దశలో ఉన్న 2000 సింగల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.

ప్రభుత్వం ఈ సన్న బియ్యం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని మంత్రి అన్నారు. దీనిలో ప్రజలందరినీ భాగస్వాములే విధంగా నాయకులు కృషి చేయాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మన దగ్గర చేయడం మనం అదృష్టంగా భావించాలని అన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 84 శాతానికి అందించబోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి 50 వేల జనాభా తగ్గకుండా జన సమీకరణ నిర్వహించాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. సభ ప్రాంగణానికి నాలుగున్నర గంటల వరకు కార్యకర్తలందరూ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ సభకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేశామని,వాటిలో ప్రజలందరినీ తీసుకురావాలని కోరారు. అందరం కలిసి సభను సక్సెస్ చేద్దామన్నారు.

Next Story

Most Viewed