Sama : ఈడీ విచారణకు ముందే కేటీఆర్ జైలుకు వెళ్తాడా? : సామ ఆసక్తిర ట్వీట్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-28 12:30:33.0  )
Sama : ఈడీ విచారణకు ముందే కేటీఆర్ జైలుకు వెళ్తాడా?  : సామ ఆసక్తిర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా-ఈ కేసు(Formula-E- Race Case)లో కేటీఆర్ అరెస్టు(KTR Arreste)కు సంబంధించి పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఫార్ములా ఈ రేసు కేసులో జనవరి 7న విచారణకు హాజరుకావాలని ఈడీ(ED Notices) నోటీసులిచ్చిన నేపథ్యంలో ఈడీ ముందు హాజరయ్యే లోపు కేటీఆర్ అలియాస్ సైకో రామ్ కేటీఆర్ జైలు(KTR to Jail)కు వెళ్తాడా? అని..పింకులు మీరేమంటారని రామ్మోహన్ రెడ్డి తన ట్వీట్ లో ప్రశ్నించారు.

మరో ట్వీట్ లో ఫార్ములా-ఈ కారు రేసు కుంభకోణంలో గతంలో మీడియా ముందు " అవును అభివృద్ధి కోసం నేనే అధికారులకు ఆదేశాలిచ్చిన..", అని గొప్పగా చెప్పుకున్న కేటీఆర్ ఇప్పుడు కోర్టు ముందు "అమ్మతోడు అభివృద్ధి లేదు ఆనంకాయ్ లేదు..నాకేం తెల్వదు.." అంటుండని, కేటీఆర్ మాట ఎందుకు మార్చినవని ప్రశ్నించారు. మాట మీద నిలబడడం వీరి వంశంలోనే లేదు అని మళ్ళీ రుజువు చేసిన సైకో రామ్ అని, మీ మొఖానికి ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ లు ఎందుకని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story