BCCI: నితీశ్‌ను హత్తుకుని తల్లిదండ్రుల భావోద్వేగం.. వీడియో విడుదల

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-28 12:35:14.0  )
BCCI: నితీశ్‌ను హత్తుకుని తల్లిదండ్రుల భావోద్వేగం.. వీడియో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: మెల్‌బోర్న్(Melbourne) వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా(Australia vs India) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అద్భుతమైన ప్రదర్శన చేశారు. జైస్వాల్(82), విరాట్ కోహ్లీ(36) మినహా వచ్చిన బ్యాటర్లంతా విఫలం అవుతున్న నేపథ్యంలో నిలకడగా రాణించి సత్తా చాటారు. వాషింగ్టన్ సుందర్(50)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తంగా 176 బంతులు ఎదుర్కొని 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అయితే, టెస్టుల్లో టెస్టుల్లో ఇది నితీశ్‌కు తొలి సెంచరీ కావడం విశేషం. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వద్ద నితీశ్‌ను హత్తుకుని తల్లిదండ్రుల భావోద్వేగానికి లోనయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియోను 'ఎక్స్' ద్వారా BCC షేర్ చేసింది. అంతకుముందు నితీశ్ తండ్రి అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘మా కుటుంబానికి ఇదొక ప్రత్యేకమైన రోజు. ఈ రోజును అస్సలు మరిచిపోలేం. నేను ప్రత్యక్షంగా సెంచరీని చూడటం మాటల్లో చెప్పలేపోతున్నా. నితీశ్‌ 99 పరుగుల మీద ఉన్నప్పుడు.. చాలా టెన్షన్‌కు గురయ్యా. అప్పటికి ఒక్క వికెట్‌ మాత్రమే మిగిలిఉంది. సిరాజ్‌ బాగా ఆడాడు. చివరికి నితీశ్‌ సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది’ అని నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Advertisement

Next Story