యువత ఉత్సాహంగా ముందుకు రావాలి: కామారెడ్డి కలెక్టర్

by Shyam |
యువత ఉత్సాహంగా ముందుకు రావాలి: కామారెడ్డి కలెక్టర్
X

దిశ, నిజామాబాద్: రక్తదానం చేయడమంటే మరొకరికి ప్రాణదాణం చేయడమని, రక్తదానం చేసేందుకు యువత ఉత్సాహంగా ముందుకు రావాలని కామారెడ్డి జిల్లా కలెక్టరు శరత్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బాన్సువాడ అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన రక్తదావ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అటవీశాఖ అధికారులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడినవారికి, గర్బిణి స్త్రీలకు రక్తం అవసరముంటదని, అదేవిధంగా డయాలసీస్ రోగులకు, తలసేమియా వ్యాధి గ్రస్థులకు రక్తమే జీవనాధారం అని ఆయన అన్నారు. రక్తదానం లాంటి సమాజ హిత కార్యక్రమాలలో ఆందరూ పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఫారెస్టు రేంజ్ అధికారి పి.సాగర్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ సంజీవరెడ్డి, అటపీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed