మాస్కులు ధరించకుంటే జరిమానా: కలెక్టర్

by Shyam |
మాస్కులు ధరించకుంటే జరిమానా: కలెక్టర్
X

దిశ, నిజామాబాద్: మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధించాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జనహిత హాలులో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్కూలు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ధరించని వారికి రూ.500 జరిమానా విధించాలని ఆదేశించారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నందున అనుమతి లేకుండా బయట తిరిగిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని 28 రోజులపాటు గృహనిర్బంధంలో ఉంచాలని తెలిపారు. అద్దె ఇండ్ల యజమానులు లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున అద్దె ఇవ్వాలని కూలీలను, ప్రజలను వేధించొద్దని సూచించారు. ఎవరైనా వేధిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కార్మికులకు బియ్యం, నగదు అందేవిధంగా చూడాలని అధికారులకు చెప్పారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరిండెంట్ అజయ్ కుమార్, ఆర్‌డీఓ రాజేంద్ర కుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: kamareddy Collector, video conference, authorities, nizamabad, masks

Advertisement

Next Story

Most Viewed