- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ కాన్వాయ్ ఎందుకు అడ్డుకున్నారంటే?
దిశ, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న విషయంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు స్పందించారు. జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావ్‌తో కూడిన ఓ కమిటీని వేశారు. సోమవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా వీరన్న పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి.. తిరిగి వెళుతున్న సందర్భంలో ఒక కుటుంబం భూమికి సంబంధించిన సమస్య విషయమై రిప్రజెంటేషన్ ఇచ్చే నిమిత్తం మంత్రివర్యుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారని తెలిసింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అదనపు కలెక్టర్ కే. సీతారామారావును విచారణ అధికారిగా నియమించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీరన్నపేట సమస్యపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పిస్తానని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు తెలిపారు.