- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధైర్యంగా పని చేయండి.. మీవెంటే మేము’
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ నివారణలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, పారిశుధ్య ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ధైర్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కంటైన్‌మెంట్ కొనసాగుతున్న అహ్మదిపుర కాలని, మాలపల్లి తదితర 55, 56 డివిజన్‌లో పర్యటించి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న విధానాన్ని ఆశా వర్కర్‌లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అని వారిని
అడిగారు. సాఫీగా కొనసాగుతుందని ప్రజలు సహకరిస్తున్నారని ప్రస్తుతానికి సమస్యలేమీ లేవని వారు కలెక్టర్‌కు వివరించారు. సిబ్బందికి అవసరమైన రక్షణ చర్యలు, జిల్లా యంత్రాంగం తీసుకుందని సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, అయితే కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంటైన్‌మెంట్ క్లస్టర్స్‌లో డ్రోన్స్‌తో అధికార యంత్రాంగం గుర్తించిన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ద్వారా రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ కమిషనర్ జితేష్ వీవీ పాటిల్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల్లో రసాయన ద్రావణం పిచికారీ చేయాలని తద్వారా ఎక్కడైనా కరోనా వైరస్ ఉంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌వో శ్రీనివాస్, డీఈఈ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags : collector, prevent, coronavirus, visits, villages, Medical staff, nizamabad