మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలి

by Shyam |
మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజలు సామాజిక బాధ్యతగా తమ సమీప ప్రాంతాలలో మొక్కలు నాటాలని కోరారు.

Advertisement

Next Story