- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెరీ గుడ్.. మున్సిపల్ కమిషనర్‌ను అభినందించిన కలెక్టర్
X
దిశ, మేడిపల్లి: మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో పట్టణ ప్రగతి, హరితహారంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి కార్పొరేషన్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని కలెక్టర్ శ్వేతా మహంతి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డిలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను అభినందించారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితుల కోసం తీసుకున్న చర్యలు భేష్ అని ప్రశంసించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీన్ బడ్జెట్ వినియోగం, మొక్కల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలు అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పాలకులు అధికారులు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. పాలకవర్గంతో పాటు, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు.
Advertisement
Next Story