- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ పల్లెలో హరితశోభ సంతరించుకోవాలి
దిశ, నాగర్ కర్నూల్ :
జిల్లాలోని ప్రతీ పల్లె హరితశోభను సంతరించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగు పేరుకుపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకుడు గుంతలకు ఆర్థిక సాయం అందిస్తున్నా ఎందుకు నిర్మించుకోవడం లేదని గ్రామస్తులను మందలించారు.
రోడ్డుపై మురుగు నీరు పారడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఇంటి ముందు నాలుగు మొక్కలు తప్పనిసరిగా పెంచాలని ఆదేశించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన జరగకుండా.. ప్రతి ఇంటి ముందు మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలను పరిశీలించారు. త్వరితగతిన పల్లె ప్రగతి పనులు పూర్తిచేయాలని చెప్పారు. మరో వారంలో మళ్లీ గ్రామంలో సందర్శిస్తానని.. అప్పుడు మార్పు కనిపించకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.