రుణాలివ్వడంతో కామారెడ్డికి ప్రథమ స్థానం..

by Shyam |
రుణాలివ్వడంతో కామారెడ్డికి ప్రథమ స్థానం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం ఐకెపీ, మెప్మా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 13,130 మహిళా స్వయం సహాయక సంఘాలకు జనరల్ లింకేజీ కింద రూ. 397 కోట్ల రుణ మంజూరు లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 6100 మహిళా సంఘాలకు రూ. 151 కోట్ల రుణాలు అందించామని గుర్తుచేశారు. దీంతో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు.

అన్ని మండలాల్లో కొవిడ్ రుణాలు వంద శాతం ఇప్పించాలని అధికారులకు సూచించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని కోరారు. మండలాల వారీగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇచ్చిన రుణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి పట్టణంలో 310 మంది వీధి వ్యాపారులకు వ్యక్తిగత రుణాలు ఇచ్చినట్లు వివరించారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, డీఆర్‌డీఓ చంద్రమోహన్ రెడ్డి, ఐకెపీ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed