- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కు ధరించకుంటే జరిమానే
by Shyam |
X
దిశ, మహబూబాబాద్:
మాస్క్ ధరించకుంటే ఎంతటివారైనా జరిమానా చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. కురవి మండల పర్యటనలో కరోనా పట్ల నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యం కనిపించిందన్నారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ నియంత్రణ పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలన్నారు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, కఠిన చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులకు గురికాక తప్పదన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సానిటైజర్ వినియోగం దినచర్యగా మారాలన్నారు. ప్రభుత్వ అధికారులంతా మాస్కులపై దృష్టి పెట్టాలని, ధరించని వారి సమాచారం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisement
Next Story